
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం 2025 సంవత్సరం పురస్కరించుకొని మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పనిచేస్తున్న షేక్.ఆజ్మతుల్లా. చేజర్ల మండలం ఉత్తమ ఎస్ఏ హిందీ ఉపాధ్యాయునిగా ఎంపిక అవడంతో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రావణ్. ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హిందీ ఉపాధ్యాయునిగా విశేష సేవలు అందిస్తూ విద్యార్థులకు హిందీ పట్ల ఆసక్తి పెంచేందుకు విద్యార్థులచే హిందీ పరీక్షలు రాయిస్తూ విద్య అభివృద్ధికి తోడ్పడు వస్తున్న షేక్.ఆజ్మతుల్లా మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన పట్ల ఉపాధ్యాయులు సిబ్బంది హర్ష వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు