
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గోరంట్ల మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయిన పాలసముద్రం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నీలం అశోక్ కి సక్సెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంజన రెడ్డి మరియు వారి పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో పనిచేస్తున్నా సహచర ఉపాధ్యాయుల పట్ల, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల సహృద్భావంతో ఉంటూ పాఠశాల అభివృద్ధి కోసం , విద్యార్థుల ప్రగతి కోసం అహర్నిశలు పనిచేస్తే ఇలాంటి అవార్డులు వాటి అంతటవే వెతుక్కుంటూ వస్తాయి అనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా ప్రస్తుత కాలంలో విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించాల్సిన ఆవస్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేముల దామోదర్ రెడ్డి , సుభాష్ నాయక్, పాఠశాల సిబ్బంది లతా, భారతి ,అశ్విని, శ్రీజన్య , తేజస్విని , రాధ్యా ,నందిని, కుమారి , శ్రీలక్ష్మి , వీణ, హుమేర , సల్మా, సుభాషిని లు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.