
పయనించే సూర్యుడు 01 . ఆగస్టు ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావు సింగ్ నాయక్
ఉద్యోగరీత్యా ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమేనని పెనుబల్లి సీఐ ముత్తిలింగం అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ పదవి విరమణ పొందిన ఆనందరావు కాలువతో సత్కరించి బహుమతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉద్యోగంలో ఎన్నో సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పదవిలో ఓడు దొడుకులు తట్టుకొని శ్రమించి పనిచేసి ఎంతో కష్టపడ్డారని అన్నారు. పదవి విరమణ అనంతరం తన కుటుంబంతో కలిసి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి ఇతర పోలీస్ స్టేషన్లకు బదిలీపై వెళ్లిన రమేష్, సీతారామరాజు, సైదా, భరత్,వెంకట్ లను సీఐ ముత్తిలింగం, ఎస్ఐ రఫీ సన్మానించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, శ్రీహరి,పోలీస్ సిబ్బంది రాజా, రవి, శంకర్, వినయ్, దేవేందర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
