
పయనించే సూర్యుడు అక్టోబర్ 14,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న
వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంకు చెందిన వీరారెడ్డి డబ్బులు నిరుద్యోగుల దగ్గర వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. మంగళవారం రోజున రోడ్డెక్కి నిరసన తెలిపారు.ఒక్కొక్కరి నుంచి రు.3.50 లక్షల రూపాయలు వసూలు చేశారని చెప్పారు.పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు తీసుకోవడం లేదని వాపోయారు, వందల మంది బాధితులు రోడ్డుపై బైఠాయించారు,తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
