
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఏప్రిల్ 4 పయనించేసూర్యుడు పని దినాలు నెలలు గడుస్తున్న కూలీలకు అందని వేతనాలు
ఒక వైపు కరువు మరో వైపు జీవనోపాధి లేదు తల్లడిల్లుతున్న పల్లె ప్రజలు
సుండుపల్లె (మం) చిన్నగొల్లపల్లె గ్రామంలో మహాత్మ గాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ గ్రామ సర్పంచ్ రామా జయచంద్ర పరిశీలించారు,కూలీలతో మాట్లాడగా వారి సమస్యలను తెలుపుతూ నాలుగు నెలలు గడుస్తున్న ఇంతవరకు వేతనాలు అందలేదని వారి బాధలను సర్పంచ్ కు తెలియజేశారు, గ్రామీణ ప్రజలకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంతో దోహదపడుతుందన్ని ఇలాంటి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుకారుస్తూన్నారని వెంటనే ఉపాధి కూలీ1లకు వేతనాలు అందజేయాలి సర్పంచ్ జయచంద్ర డిమాండ్ చేశారు.... అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేశారు.