
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ఎండు రూపాయల కి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎండు రూపాయలు పెరిగింది. ఈరోజు నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది.మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పల్లె పండగలో భాగంగా ఉగాది రోజున రూ.557 కోట్లతో 1,202.66 కిలోమీటర్ల మేర 402 రహదారుల పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండలాలను కలిపే రోడ్లను నిర్మించనున్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం వందరోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మేరుగు పరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది, దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత ఉపాధి దొరుకుతుం డడంతో పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లి వారి సంఖ్య గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది.