
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ డిమాండ్
( పయనించే సూర్యుడు మార్చి 22 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు ఆయన ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులు పని ప్రదేశాన్ని సందర్శించారు అనంతరం కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల ఏపీఓ అరుణకు వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి కార్మికులకు పనిచేస్తున్న తరుణంలో కాసేపు విరామం తీసుకోవడానికి ఎండ నుంచి ఉపశమనం కలిగించుటకు టెంటు ను ఏర్పాటు చేయాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇవ్వాలని అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని మెడికల్ కిట్టును అందుబాటులోకి తేవాలని. పని దినాలను 100 రోజుల నుంచి 200 రోజులు పని దినాలు కల్పించాలని మరియు కనీస వేతనం 300 నుంచి 800 పెంచి ఇవ్వాలని అదేవిధంగా మెజర్మెంట్ లేకుండా పనిని కల్పించాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డు ఇచ్చి పని కల్పించాలని ఆయన డిమాండ్. చేశారు. అనంతరం ఏపీఓ అరుణ మాట్లాడుతూ వెంటనే రేపటి నుంచి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని బూర్గుల గ్రామపంచాయతీ సెక్రటరీను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు లాలయ్య. పెంటయ్య అంజయ్య. కృష్ణయ్య. యాదమ్మ. అలివేలు. పవన్. యాదయ్య. తదితరులు పాల్గొన్నారు