Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్ఉపాధి హామీ లక్ష్యాలను పూర్తి చేయాలి..

ఉపాధి హామీ లక్ష్యాలను పూర్తి చేయాలి..

Listen to this article

మార్చి 15లోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చెయ్యాలి.. ప్రతి రైతు వ్యవసాయ భూమిలో ఫారం పాండ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి.. రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టాలి.. ఇందిరమ్మ ఇండ్ల ఎల్ -1 జాబితాను శనివారం లోగా పూర్తి చేయాలి..

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.


పయనించేసూర్యుడు మార్చి 12 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉపాధి హామీ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అతను విద్యాచందన తో కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు క్లస్టర్ వారిగా పని దినాలు చేపడుతున్న పనులు, ఆస్తి పన్ను వసూలు పురోగతి, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై జిల్లాలోని తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించేందుకు ఎక్కువ అవకాశం గల పనులు పై దృష్టి సారించాలని, ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ఫారం పాండ్స్, ఫీడర్ ఛానల్ పనులు, రోడ్డు ఫార్మేషన్,ట్రంచ్ వర్కులు, బౌండరీలు తదితర పనులకు సంబంధించి అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు. క్లస్టర్ల వారీగా చేపట్టే పనులలో లేబర్ మొబలైజేషన్ ఎక్కువగా ఉండాలని, వారికి పని దినాలు కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఫారం పాండ్స్ కచ్చితంగా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో బోరు పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారం పౌండ్స్ తవ్వడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, పందిరి సాగు, చేపల పెంపకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలను పెంచడం కోసం, ఆనంద కాలంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రతి రైతు కచ్చితంగా ఫారం పౌండ్ లు ఏర్పాటు చేయవలసిందే అని ఆయన స్పష్టం చేశారు. మార్చి 31 వ తారీకు లోపల ఉపాధి హామీ పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రామాల అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేలా, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకచోట ఇంకుడు గుంతలు తవ్వకాలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పనులన్నీటిని ఉపాధి హామీ పథకంలో కాకుండా గ్రామాల్లోని అందరి సమన్వయంతో నిర్వహించాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, రహదారుల పక్కన ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని ఆయన తెలిపారు. చేపట్టిన నిర్మాణాలు అన్నింటి నీ జల సంచేయ్ జన్ భగీదారి ప్రోగ్రాంలో అప్లోడ్ చేయాలని, దాని ద్వారా దేశంలోని జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణాల్లో మొదటి నిలిచేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మార్చి 15 తేదీలోగా జిల్లాలోని అన్ని ఆస్తి పన్నుల బకాయిలు 100% వసూలు చేయాలని పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ ఆదేశించారు. మార్చి 15 తరువాత ఎవరైతే బకాయిలు చెల్లించలేదో వారి వివరాలను ఫ్లెక్సీల ద్వారా గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని, లేదా ఇంటిముందు డప్పులు వాయించాలని కలెక్టర్ తెలిపారు. ఆస్తి పన్నులు ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా లో సమస్యలను సత్వరమే పరిష్కరించి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎల్ వన్ జాబితాను శనివారంలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పిడి హౌసింగ్ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, పంచాయతీరాజ్ ఈ ఈ కాశయ్య, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, నలిని, డి ఎల్ పి ఓ సుధీర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments