
పయనించే సూర్యుడు న్యూస్ జులై 10// నారాయణపేట జిల్లా బ్యూరో//
నారాయణపేట మండల శాఖఅధ్యక్షులు ఎం. రఘువీర్, ప్రధాన కార్యదర్శి ఎం. జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వై జనార్ధన్ రెడ్డి, జీ. హెచ్. యం.లు సునీత,భారతి, రాష్ట్ర సహ అధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు, DSO భాను ప్రకాష్ ముఖ్య అతిథులుగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం సందర్భంగా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక ఉపాధ్యాయ సంఘం. PRTU అని అన్నారు.ఉపాధ్యాయ సమస్య లు ఎన్నివున్నాఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తున్నందున NAS 2025 విద్యా రంగంలో తెలంగాణ విద్యార్థులు మెరుగైన ర్యాంకు సాదించిదని గుర్తు చేశారు.విద్యా రంగంలో ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న 5డిఏలను, పీఆర్సీ, ఈహెచ్యస్ మరియు బదిలీలతో కూడిన ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులంతా ఉత్సాహంగా సభ్యత్వాలు స్వీకరించి సంఘ పటిష్టతను చాటారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యం రఘువీర్, అధ్యక్షులు మహేష్, కల్యాణి, రాష్ట్ర సహా అద్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా కార్యద్శి నర్సింగ్ రావు, GHM లు సునీత, భారతి, ఉపాధ్యాయులు వెంకటేష్, నవీన్ కుమార్, Chart కుమార్, DSO భాను ప్రకాష్, బాలాజీ కాంబ్లే, శివరాజ్,సందీప్, శ్రీనివాస్ శశిరేఖ, శిరీష, నిర్మల,తదితరులు పెద్దమొత్తంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు
