
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
దసరా మరియు దీపాలు సందర్భంగా సూళ్లూరుపేట మున్సిపల్ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు మేరకు ఈరోజు సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు శ్రీ శంకు సురేష్ సహకారంతో. మునిసిపల్ కమిషనర్ చిన్నయ్య చేతుల మీదగా మునిసిపల్ పారిశుద్ధ కార్మికులకు సుమారు 200 మంది మహిళలకు చీరలు, పురుషులకు పంచీలు స్వీట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కమిటీ సభ్యులు మా బాషా . సూళ్లూరుపేట మండల అధ్యక్షులు ఆవుల రమణ . నక్కా హరి బాబు, ఆవుల దాసు,కోటి యాదవ్ సాకి హరి,సూరి,జనసేన వీర మహిళలు పద్మజ, సుజాత పాల్గొన్నారు.
