పయనించే సూర్యుడు, జనవరి 30, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత : జగ్గయ్యపేట చెరువు బజార్ లోని ఊర చెరువు పార్క్ నందు గల సుమారు 40 మొక్కలను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పార్క్ లోని ధ్వంసమైన మొక్కలను పరిశీలించిన అనంతరం పట్టణ మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ధ్వంసానికి కారకులైన వారిని గుర్తించి, తిరిగి వాటి స్థానంలో కొత్త మొక్కలు ఏర్పాటు చేయాలని, పార్క్ కు భద్రత కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు మరియు కౌన్సిలర్ కొలగాని రాము గార్లు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేందుకు సుమారు రూ . 3.00 కోట్ల నిధులతో పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో,కాశీ కిషోర్, మైనారిటీ నాయకులు షేక్ సత్తార్, కొ ఆప్షన్ సభ్యులు షేక్ ఖాదర్ బాబు, జనసేన నాయకులు కోసూరి ప్రహ్లాద్, ఆవాల భవానీ ప్రసాద్, బజారు సాయి, కాకర్ల లక్ష్మీ నారాయణ, మేడూరి వెంకటాద్రి (బబ్లూ), పోలంపల్లి బాలకోటి, అరవింద్, మాడుగుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఊర చెరువు పార్క్ మొక్కలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: జనసేన డిమాండ్
RELATED ARTICLES