
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్7// మక్తల్
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మక్తల్ మండలంలోని సంగం బండ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మొత్తం 4194 మందితో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యదర్శి శారద విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా స్త్రీలు, పురుషులతో కూడిన ఓటర్ల జాబితాలు అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, సిద్ధార్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
