
లక్షా పదహారు వేలకు మొదటి లడ్డు దక్కించుకున్న పాతూరి బ్రహ్మయ్య , 86 వేలకు రెండవ లడ్డు దక్కించుకున్న పాతూరి సత్యనారాయణ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పౌల్ట్రీ రైతులు గత 40 సంవత్సరాలుగా ఎంపీ శేషయ్య, నాగరత్నమ్మ కమ్యూనిటీ హాల్ లో వినాయక చవితి కుటుంబ సభ్యులతో జరుపుకోవటం ఆనవాయితీ. నిత్య అన్నదానం ఇక్కడ ప్రత్యేకత. పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట కార్యదర్శి పాతూరి వెంకటరావు ఆధ్వర్యంలో ఎంపి శేషయ్య నగర్ వినాయక సేవా సమితి సభ్యులు నారాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు లడ్డు వేలం నిర్వహించారు.. ఈ వేలం లో మొదటి లడ్డు ను పాతూరి బ్రహ్మయ్య లక్షా పదహారు వేలకు, రెండవ లడ్డు ను పాతూరి సత్యనారాయణ 86 వేలకు దక్కించుకున్నారు.. వీరి ఇరువురిని సల్వాలతో సన్మానించి లడ్డూలను అందచేసిన పాతూరి వెంకటరావు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు సబ్యులు గుదే వసంతరావు, మలినేని శ్రీను, బానురి శ్రావణ్, సురేష్, ఎర్రగుంట్ల శ్రీను , పూర్ణ, కోటేశ్వర రావు, నాగేశ్వర రావు, మక్కాపాటి మల్లేశ్వర రావు, మలినేని సాంబశివ రావు, గుదే మస్తాన్ రావు, నాగార్జున, మనీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..
