
పయనించే సూర్యుడు అక్టోబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు, ఈ తరుణంలో కొత్తగూడెం అమృత హాస్పిటల్ ప్రముఖ డాక్టర్ ఇరుకు బాబూరావు దృష్టికి తీసుకొని వెళ్లగా ఈరోజు డాక్టర్ బాబూరావు సతీమణి డాక్టర్ జయ శ్రీ చేతుల మీదగా గొడ్ల సంధ్యరాణి కి 15 వేల రూపాయలు,మేడి నాగేశ్వరి కి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయన్ని అందించి విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఇంకా రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తానాని భరోసా ఇచ్చారు ,డాక్టర్ జయ శ్రీ మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులు పేరు తెస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం పొంది నిరుపేదలకు వైద్య,ఆర్ధిక పరంగా సహాయం చెయ్యాలని విద్యార్థినిలను ఆశీర్వదించారు..వీరి వెంట తంబర్ల పుల్లారావు, కొమ్మిగిరి వినోద్, విద్యార్థిని తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు..