
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది 29.03.2025
మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నరెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చింతూరు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం దగ్గర మండల పార్టీ అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధన కై చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ది కి కృషి చేద్దాం అన్నారు. తెలుగుదేశం పార్టీని ఆనాడు నందమూరి తారక రామారావు కేవలం ఆరు నెలల్లో పార్టీని స్థాపించి విజయదుందబి మ్రోగించారన్నారు.ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా కోరరు . ఎన్టీఆర్ విగ్రహం కు మాజీ మండల అధ్యక్షులు ఓబులనేని రామారావు చౌదరి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ర్యాలీ గా వెళ్లి రాజీవ్ గాంధీ సెంటర్లో జెండాను ఆవిష్కరించారు ఒకరికొకరు స్వీట్ పంచుకొని పార్టీ ఆవిర్భావ రోజును పండుగ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకోజు నూక చారి,తివారి మధుసూదన్ రావు,వాసా శ్రీరామ్మూర్తి రెడ్డి, సయ్యద్ ఆసిఫ్,కట్టా శంకర్,దూలయ,సాల్మన్ రాజు,సురేష్ చౌదరి,నరసింహ రావు చౌదరి, ముత్యాల శ్రీరామమూర్తి, నరసింహారావు చౌదరి, వినోద్,సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
