
పయనించే సూర్యుడు మార్చి 29 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి . మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు