
పయనించే సూర్యుడు మార్చి1 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం నేడు రాజంపేట నియోజకవర్గం, సుండుపల్లె మండలం నందు పర్యటిస్తూ ప్రభుత్వ అధికారులు పార్టీ ముఖ్య నేతలతో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీ పండుగ వాతావరణంలో లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని,రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. చంద్రన్న సారథ్యంలో బడ్జెట్లో కూడా పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లే రెడ్డప్ప,మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు,మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు,టిడిపి సీనియర్ నాయకులు శివరాం నాయుడు, రాయవరం సర్పంచ్ షరీఫ్, గ్రామ అధ్యక్షులు సుబ్బరామ, పార్లమెంట్ అధికార ప్రతినిధి కిరణ్, తెలుగు యువత మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, మస్తాన్ బాబు,గౌస్,మంగిరి సురేష్, జనసేన నాయకురాలు జనసేన అధ్యక్షులు రాజా, జగిలి ఓబులేష్,మహిళా నాయకురాలు కల్పన,సంతోష్, సుండుపల్లె బిజెపి నాయకులు వెంకటరామరాజు,బిజెపి అధ్యక్షుడు రమణ గౌడ్, పెదినేని కాలువ సర్పంచ్ నాగేంద్ర, ఎల్వి రమణ, ఏజెంట్ రమణ బీసీ నాయకులు రమణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.