“షేర్ పల్లి బందారంలో ఇందిరా గాంధీ విగ్రహానికి తొలగించని ముసుగు”
(పయనించే సూర్యుడు అక్టోబర్ 29 రాజేష్)
20 రోజులు గడుస్తున్న విగ్రహాలకు ముసుగులు తొలగించకపోవడంతో అధికారులు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వేసిన ముసుగులను అధికారులు తొలగించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల చేసిన జీవో 9 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకటించడంతో అధికారులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల విగ్రహాలకు, రాజకీయ నాయకుల విగ్రహాలకు, అభివృద్ధి పనుల శిలాఫలకాలకు ముసుగులు వేశారు. అయితే అక్టోబర్ 9న బీసీలకు 42 రిజర్వేషన్, జీవో నెంబర్ 9 చల్లదని స్థానిక ఎన్నికలపై స్టే విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచే రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. అయినప్పటికీ, దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరిపల్లి బందారం ప్రధాన రోడ్డుకు ఇందిరాగాంధీ విగ్రహానికి, అభివృద్ధి పనుల శిలాఫలకానికి వేసిన ముసుగులను అధికారులు ఇంతవరకు తొలగించకపోవడంతో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్న అధికారులు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా అని విమర్శిస్తున్నారు.


