
రుద్రూర్, అక్టోబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
దసరా పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండల నాయకులు బాన్సువాడలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నారోజి గంగరాం, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పట్టేపు రాములు, పత్తి లక్ష్మణ్, దిశ కమిటీ మెంబర్ నాగేష్, తోట్ల గంగారాం, సంజీవులు, పార్వతి ప్రవీణ్, రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు.