
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందు ఎస్సై 2 గా పదవి బాధ్యతలు స్వీకరించిన పి. శ్రీనివాస్ రెడ్డి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నూతన ఎస్సై 2కు స్వీట్ తినిపించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ ఎస్ఐ సూర్య తదితరులు పాల్గొన్నారు.