Tuesday, July 22, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే గారు ఆదివాసుల చావు కేకలు వినిపించడం లేదా ఏజెన్సీలో వైద్యం సరిగ్గా అందక ఆదివాసులు...

ఎమ్మెల్యే గారు ఆదివాసుల చావు కేకలు వినిపించడం లేదా ఏజెన్సీలో వైద్యం సరిగ్గా అందక ఆదివాసులు పిట్టల్లా రాలిపోతుంటే మీ సుపరిపాలన ఎక్కడ పోయింది? ఆదివాసి రిజర్వేషన్లతో గెలిచి గిరిజనఏతరుల పక్షపాతిగా నడుచుకుంటూ ఉన్న ఎమ్మెల్యే వైఖరి నశించాలి.

Listen to this article

మృతురాలు పార్వతి కుటుంబాన్ని పరామర్శించిన ఆదివాసి సంక్షేమ పరిషత్ బృందం.

పయానించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 22

ఇటీవల రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన కాకూరి పార్వతి స్వగ్రామం వైరామారం మండలం జాజిగడ్డ గ్రామానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ బృందం వెళ్లి పార్వతి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం పార్వతి తల్లి కాకూరి విశ్వమ్మ, భర్త దుర్గాప్రసాద్ తో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడటం జరిగింది. పార్వతి తల్లి మరియు భర్త హాస్పిటల్లో జరిగిన సంఘటనను వైద్యులు నిర్లక్ష్యాన్ని పూర్తిగా వివరించడం జరిగిందని పార్వతి మృతి 100% వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆయన అన్నారు. తమ సంఘానికి ఏ వైద్యులపై వ్యక్తిగత ద్వేషాలు లేవని పార్వతి మృతికి కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆదివాసి సంక్షేమ పరిషత్ పూర్తి ఆధారాలతోటి ఉద్యమిస్తుందని అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రంపచోడవరం శాసనసభ్యురాలు గారికి ఆదివాసుల చావు కేకలు వినిపించటం లేదా అని ప్రశ్నించారు. తమ కూటమి ప్రభుత్వం ఇంత చేస్తుంది అంత చేస్తుందని ప్రగాల్బాల్ పలుకుతూ పార్టీలు పార్టీలు కొట్టుకోవటం జరుగుతుంది గానీ ఏజెన్సీలో సరైన వైద్యం అందక ఆదివాసులు పిట్టల్లా రాలిపోతుంటే ఆ చావు కేకలు మాత్రం శాసనసభ్యులకు పట్టడం లేదని ఆయన విమర్శించారు. పార్టీ కార్యకర్తలకు గాని నాన్ ట్రైబల్స్ గాని ఏదైనా చిన్న సంఘటన జరిగితే అమితమైన ప్రేమతో తక్షణమే వాళ్ళ దగ్గరికి వాలిపోయి పరామర్శించే ఎమ్మెల్యే గారు పార్వతి విషయంలో ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ వైద్యశాలలలో సరైన వైద్యులు లేక సరైన వైద్య సౌకర్యాలు లేక ఒకపక్క వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఎమ్మెల్యే నిమ్మకు నీరు ఎత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు పార్టీ కోసం, ఓటు బ్యాంకు కోసం కాదని ఆదివాసీల సంక్షేమం, రక్షణ పై కూడా బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో ఉండే శాసనసభ్యురాలుగా ఉంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు వైద్యులు నియమించడానికి చర్యలు తీసుకోలేని ఎమ్మెల్యే ఇక ఆదివాసులకి ఏం న్యాయం చేయగలరని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల అప్పుడు ఆదివాసులు, ఆదివాసుల బాధలు గుర్తుకొస్తాయని గెలిచిన తర్వాత మాత్రం నాన్ ట్రైబల్స్ , నాన్ ట్రైబల్ బాధలు మాత్రమే గుర్తుంటాయని విమర్శించారు. గెలిచిన ప్రజాప్రతినిధులకు ఐదేళ్లపాటు ఆదివాసుల సంక్షేమం కనిపించదని అన్నారు. ఆదివాసి రిజర్వేషన్ వాల్లన వారికి ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లభించింది అనే విషయాన్ని వారు మరిచి ఆదివాసీల రక్షణను విస్మరిస్తున్నారని ఆయన ప్రజాప్రతినిధులపై విమర్శించారు. ఎంతోకాలంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో రాజకీయం పులుముకుని ఉందని, దాని పర్యాసనము రోగులు పాలిట శాపంగా మారుతుందని, హాస్పిటల్ లో చేరే రోగులు మృత్యువాత పడుతున్నారని వీటిపై కూడా ఎమ్మెల్యే దృష్టి సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉన్నత అధికారులతోటి సంబంధిత మంత్రుల తోటి మాట్లాడి పూర్తిస్థాయిలో వైద్యులు నియమించే విధంగా చర్యలు చేపట్టాలని, మృతికి కారుకులైన వైద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చర్యలు ఆదేశించాలని, పార్వతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని అలాగే ఇటువంటి సంఘటనలు పునావృతం కాకుండా ఉండాలి అంటే సంబంధిత అధికారులు పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేని డిమాండ్ చేశారు. వీటిపై ఎమ్మెల్యే గారు స్పందించకుంటే తమ ఉద్యమం ఎమ్మెల్యే మీద కొనసాగుతుందని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివారం సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు నూకరాజు, డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్ పార్వతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments