
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి // 18 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల
ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను పట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ అభిమానులు మాట్లాడుతూ..విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత హరికృష్ణకు అండగా నిలిచి ఆయన గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ట్టభద్రుల, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రసన్న హరికృష్ణకు పూర్తి అవగాహన ఉందన్నారు. పట్టభద్రులు ఎదురుకుంటున్న సమస్యల పట్ల కలత చెంది 19 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో మన ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలువాల్సిన సమయము సన్నమైందన్నారు. ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పట్టణంలోని క్రీడా మైదానంలో వాకర్స్ ను డీసీఎంఎస్ కాంప్లెక్స్ పట్టభద్రులను విద్యానగర్లో సూపర్ బజార్ అంబేద్కర్ చౌరస్తా తదితర ప్రధాన కూడళ్ల వద్ద ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం గొడిశాల రమేష్ డివిజన్ ఇంచార్జ్ అధ్వర్యంలో ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి విజయ్ , అంతడుపుల శ్రీనివాస్ విస్తృత ప్రచారo నిర్వహించిన వారిలో ఉన్నారు.
