

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ : తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మండలం ఎరుగట్ల తహసిల్దార్ ఆదేశాల మేరకు వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయబడును ఈ రోజు మంగళవారం రోజున ఉదయము తగిన సమాచారాము మేరకు తాళ్ళ రాంపూర్ గ్రామములో బోడగుట్ట ప్రాంతము ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరము తవ్వుచున్న TATA HITACHI EX-140 పోక్లేను మరియు ట్రాక్టర్ No. TS 16 FH 6828, TS 35 F 8125 నెంబర్ గల 2 ట్రాక్టర్లు రెవిన్యూ సిబ్బంది పట్టుకోవడము జరిగినది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మట్టిని తరలిస్తున్న పోక్లేను, 2 ట్రాక్టర్లు గురించి పోక్లేను యజమాని బత్తుల రమణయ్యకు పోక్లేనుకు రూ. 20000/- మరియు 2 ట్రాక్టర్లు కు రూ. 10000/- మొత్తము రూ. 30000/- జరిమానా విదించి వాహనములు విడుదల చేయనైనది. మండలములో ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మట్టినిగాని, ఇసుకను రవాణా చేసినట్లు అయితే చట్ట ప్రకారము వాహనములు సీజు చేసి కేసులు నమోదు చేయబడును అని ఇందుమూలముగా తెలియజేయనైనది.