
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సర్వే నంబర్లతో సీజీజీకి అప్డేట్ చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు
ఎఫ్ టీఎల్ బఫర్‌జోన్, ప్రభుత్వ భూముల్లో ఉండే అనుమతులు లేని లే అవుట్ల వివరాలు సర్వే నంబర్లతో ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది
ఎల్ఆర్ఎస్ పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం ఫీజు రాయితీ నేపథ్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సీజీజీ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. ఇందులో భాగంగా అక్రమ లేఅవుట్లకు సంబంధించిన అన్ని వివరాలను సీజీజీకి పంపాలని అధికారులకు మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం గైడ్ లైన్స్ విడుదల చేసింది. చెరువులు బఫర్ జోన్లు ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ లేఅవుట్ల వివరాలు సర్వే నంబర్లను పరిశీలన కోసం ఇరిగేషన్, రెవెన్యూ శాఖకు పంపిస్తామని తెలిపింది ఈ రెండు కేటగిరిల అప్లికేషన్లను త్వరగా ప్రాసెస్ చేయాలని మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశించారు. ఈ రెండు కేటగిరిలు కాకుండా మిగతా దరఖాస్తులకు ఇరవై ఐదు శాతం ఫీజు రాయితీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు వచ్చే నెల ముప్పై ఒకటవ తేదీ లోపు ఫీజులు చెల్లించుకోవాల్సిందిగా స్పష్టం చేశారు