
ఎస్ డి సి కోర్ట్ చింతూరు ఐటిడి ఏ లో ఏర్పాటు చేయాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 28
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లోని ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎల్ టి ఆర్ కేసులు వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా S DC కోర్టు ఏర్పాటు చేయాలని అలాగే చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని ఆదివాసి జేఏసీ మరియు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో చింతూరు ప్రాజెక్టు అధికారి వారిని కోరడం జరిగింది. అనంతరం కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్ కు విరుద్ధంగా నమోదైన ఎన్టీఆర్ కేసులు తక్షణమే పరిష్కరించి నాన్ ట్రైబల్ అక్రమాలను భూకబ్జాలను నిరోధించాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. అక్రమ కట్టడాల తొలగింపుకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ జీవోలు, మరియు ఏజెన్సీలోని 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని NCST ఉత్తర్వులను పిఓ గారికి అందజేసినట్లు ఆయన ఈ సమావేశంలో తెలిపారు. ఏజెన్సీ చట్టాలు పటిష్టంగా అమలయితేనే నాన్ ట్రైబల్స్ వలసలు అరికట్టగలమని, లేకుంటే జీవో నెంబర్ 3 పోగొట్టుకున్నట్టే ఏజెన్సీ చట్టాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని కావున నాన్ ట్రైబల్స్ అక్రమాలకు విరుద్ధంగా ఆదివాసి లందరూ ఏకతాటిపై వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. చింతూరు తో పాటు చింతూరు డివిజన్లో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించాలని ఈ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. నా ట్రైబల్స్ వలసలు వలన ఏజెన్సీలోని ఆదివాసి చట్టాలు నేరుగారిపోవటమే కాకుండా ఆదివాసి సంస్కృతి విచ్చినమవుతుందని ఇది ఇలాగే కొనసాగితే ఆదివాసి భవిష్యత్ తరాలకు మనుగడ కష్టమవుతుందని కావున ఆదివాసులు మేల్కోవాల్సిన అవసరం ఉందని ఆదివాసులు అందరు ఏకతాటిపై కొచ్చి ఒకే జండా తోటి అక్రమ కట్టడాలు కూల్చే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమములో జేఏసీ వైస్ చైర్మన్ శీలం తమయ్య కాకా.సీతరామయ్య,కారం.సాయిమడివి రాజు,మడకం రాజమ్మ తదితరులు పాల్గొన్నారు