
ప్రారంభించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్..
హాజరైన సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,మరియు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు..
వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి..
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ప్రతి ఒక్కరు ఆరోగ్య వంతగా ఉండాలంటే వ్యాయామాని వారి యొక్క దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలని వ్యాయామంతో ఆరోగ్యాని మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో నూతనంగా వడ్డే యాదగిరి ఏర్పాటు చేసిన ఎ1 టూస్టార్ ఫిట్నెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై ఎ1 టూస్టార్ ఫిట్నెస్ క్లబ్ ని ప్రారంభించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణ్ రెడ్డి,మాజీ సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి,పిఎసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ పిఎసీఎస్ చైర్మన్ విట్టల్, మాజీ సర్పంచ్ లు గోవింద్ అశోక్, జెట్ట కుమార్,సత్తయ్య,మాజీ ఎంపిటిసి కట్న మాదవి రవీందర్ నాయకులు మెండెకృష్ణ,బండ మల్లేష్,సములయ్య,కొమ్ము వెంకటయ్య,భూపాల్, శ్రీశైలం,శ్రీను,రమేష్ గౌడ్ శివ చారి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు..
