జాతీయ బాలికల దినోత్సవం మరియు అంతర్జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా స్థానిక భారతీయ స్టేట్ బ్యాంకు తిరువూరు మెయిన్ బ్రాంచ్ తరుపున, స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో నాలుగు సైకిళ్లు బహూకరించారు.
పయనించే సూర్యుడు జనవరి 24 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ:- ఈ సందర్భంగా ఎస్బిఐ తిరువూరు చీఫ్ మేనేజర్ పి రవి కుమార్ మాట్లాడుతూ బాలికల సర్వతోముఖాభివృద్ధి కి అందరూ సహకరించాలని, అందుకు బ్యాంకు సేవలు, సుకన్య సమ్రుద్థి, ఎన్పీఎస్ వాత్సల్య ఆర్ డి వంటి సేవలకి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు.
శ్రీ మనీశ్ కుమార్ సింగ్, డీజీఎం, విజయవాడ ఏవో శ్రీ రాఘవ రావు, రీజనల్ మేనేజర్, ఆర్డిఓ విజయవాడ వారి సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని రవి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీ రాజు గారు మరియు ఇతర అధ్యాపకులు, ఎస్బిఐ తిరువూరు శాఖ సిబ్బంది, కె శ్రావణి, కె గోపీనాథ్, బి ఎల్ హెచ్.ప్రసాద్, కె సునీల్ కుమార్, డి శ్రీను, భవాని, నిఖిత, బ్రహ్మం, పుల్లారావు, సత్యనారాయణ, రాఘవమ్మ తదితరులు పాల్గొన్నారు.