
తెలంగాణ ఆదివాసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు.
28 వ తేదీన ఛలో భద్రాచలం – ధర్మ యుద్ధం విజయవంతం చేయండి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 26
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం, లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని కోనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని తెలంగాణలో ఆదివాసీలు సాగిస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సంపూర్ణ మద్దతూ ప్రకటిస్తున్నామని అలాగే ఆదివాసి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యలు గా ఉన్న ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటించి లంబాడీలను యస్ టి జాబితా నుండి తొలగించే నినాదాన్ని బలపరచాలని పిలుపు ఇచ్చారు చేశారు. 1/70, 3 జి ఓ, ఎస్ టి జాబితా నుండి లంబాడీల తొలగింపు అంశాల ఉద్యమాలు రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీల ఉమ్మడి ఉద్యమాలని ఈ అంశాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ ఆదివాసీలకు సంపూర్ణ మద్దతుగా ఉంటామని ప్రకటించారు.రాజ్యాంగ విరుద్ధంగా, ఆర్టికల్ 342 మరియు 244 అధికారాలను కాలరాస్తు 1976 ప్రాంతంలో గిరిజనేతరులైన లంబాడిలను ఎస్ టి జాబితాలో కలిపి ఆదివాసీ సమాజ అభివృద్ధికి గండి కొట్టారని, తెలంగాణాలో జరుగుతున్న లంబాడిలను ఎస్ టి జాబితానుండి తొలిగించాలని చేస్తున్న ఉద్యమనికి ఆంధ్రా ఆదివాసీలు అందరూ సంపూర్ణంగా మద్దతుగా ప్రకటించడం మంచి పరిణామo, ఈ నెల 28న ఛలో భద్రాచలం – ధర్మ యుద్దానికి ఆదివాసీలు సభను ఆదివాసీలు భారీగా తరలి వచ్చి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు .