
దేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) విద్యార్థుల హక్కుల కోసం పోరాడేందుకు విద్యార్థి సంఘాలు అవసరం ఏఐఎస్ఎఫ్ 2025 డైరీని ఆవిష్కరిస్తున్న మండల విద్యాధికారి ఎంఈఓ మనోహర్ ,, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పవన్ చవాన్ ఉపాధ్యాయుల బృందం,, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
అఖిల భారత విద్యార్థి సమైక్య ( 𝗔𝗜𝗦𝗙)
( పయనించే సూర్యుడు మార్చు 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
షాద్నగర్ నియోజకవర్గం ప్రభుత్వ ఫరూక్నగర్ బాయ్స్ స్కూల్లో ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఆధ్వర్యంలో 2025 డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మనోహర్, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ చవన్, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఉపాధ్యాయుల బృందం మాట్లాడుతూ,, దేశ స్వతంత్రం కోసం 1936 ఆగస్టు 12న ఆవిర్భవించిన భారత దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. అదేవిధంగా విచారణ సమస్యలు పరిష్కారం కోసం అసమాన తల లేని సమాజ నిర్మాణం కోసం సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తూ సమ సమాజాన్ని స్థాపించడం కోసం కృషి చేస్తుందన్నారు. ఎక్కడ విద్యార్థికి అన్యాయం జరిగిన మేమున్నాము అని ముందు నడిచే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని కోరారు. ఏఐఎస్ఎఫ్ 2025 వ సంవత్సరం డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం హెచ్ఎం శైలజ, శంకరయ్య, తిరుపతి రెడ్డి ఏఐఎస్ఎఫ్ షాద్నగర్ డివిజన్ నాయకులు శ్రీను, రాజేష్, అరుణ్, రాహుల్, సునీల్ ప్రకాష్, మరియు తదితరులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.