
ఏఐవైఎఫ్ నియోజకవర్గఅధ్యక్షకార్యదర్శులు సౌటుపల్లి చిన్న బాబు, కే.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి.రాంబాబు
పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి :11)పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం రిపోర్టర్ కుడారి జాన్సన్
వార్తా విశ్లేషణ:- శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6,7,8,9 తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్ కోరారు.ఈ సందర్భంగా చిలకలూరిపేట సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని , నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారని అన్నారు. దేశంలో 4,28,278 మంది మహిళల పైన, 1,49,404 చిన్నపిల్లల పైన దాడులు, హత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాటిని నిలువురించే పరిస్థితి లేదని అన్నారు. ఉత్తరాంధ్రకు జీవనాధారంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం , కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని కోరారు. అనేక అంశాలపై శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్ పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో AIYF పట్టణ కన్వీనర్ బి రాంబాబు పాల్గొన్నారు.