
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలఅంసారం ఎర్గట్ల మండలలో తాళ్ల రాంపూర్ గుమ్మిరాల్ దోమచంద గ్రామంలలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రమాణం చేసి అనంతరం ప్రజాస్వామ్య వదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో గ్రామంలో పాదయాత్ర చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా మరియు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని… వారి ఆదేశాల అనుసారం ప్రతి గ్రామ గ్రామాన ప్రజలను సంఘటిత చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతామని అన్నారు.. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
