
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి, మోర్తాడ్,భీంగల్, ఏర్గట్ల మండలాల్లో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ పర్యవేక్షకుడిగా ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ,బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ , జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి తోటపడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని రాజ్యాంగ రచయిత అంబేద్కర్ పై మరియు స్వాతంత్ర ఉద్యమం రథసారథి మహాత్మా గాంధీపై నీచంగా వ్యాఖ్యలు చేస్తుందని ప్రజలు ఉమ్మడిగా మరో సత్యాగ్రహాన్ని చేయాలని రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో అన్ని మండలాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
