Friday, September 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలకు రక్షణ ఏది ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలు పటిష్టంగా ఎందుకు...

ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలకు రక్షణ ఏది ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలు పటిష్టంగా ఎందుకు అమలు చేయటం లేదో అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19

✍️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక భూచట్టాలు అమలకు నోచుకోక ఏజెన్సీ భూభాగం మొత్తం కూడా నాన్ ట్రైబల్ కబ్జాలోకి వెళ్ళిపోతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. అడ్డతీగల మండలం సరంపేట గ్రామంలో శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఏజెన్సీలోని భూ చట్టాలను ఎందుకు పటిష్టంగా అమలు చేయడం లేదో అసెంబ్లీ సాక్షిగా ఆదివాసి ప్రజానీకానికి తెలియజేయాలని ఆయన గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రులను డిమాండ్ చేశారు. ఆదివాసి ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి కాలయాపన చేయటం కోసం కాదని భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులు కల్పించిన హక్కులు చట్టాలు పటిష్ట అమలకు కృషి చేసే విధంగా సట్ట సభలో స్పందించాలని ఆయన తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన ఏ అసెంబ్లీ సమావేశంలో కూడా ఆదివాసి కోటలో ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభకు వెళ్లిన ఆదివాసి ప్రజాప్రతినిధులు ఏజెన్సీలోని ప్రత్యేక హక్కులు, భూ చట్టాలైన 1/70 చట్టం పట్టిష్ట అమలు కొరకు మాట్లాడిన దాఖలా లేవని ఆయన మండిపడ్డారు. ఆదివాసి రిజర్వేషన్ తో గెలిచి కొంతమంది ఎమ్మెల్యేలు మాకు ఆదివాసీలు, గిరిజనయేతరులు రెండు కళ్ళు వంటి వారిని చెప్పుకుంటూ ఓట్ల కోసం వారి పబ్బం గడుపుకుంటున్నారే తప్ప, ఏజెన్సీని దోచుకుంటున్నటువంటి నాన్ ట్రైబల్స్ పై చర్యలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని, వీటిపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో మైదాన ప్రాంతాల్లోని జనరల్ కోట అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిచే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. కేవలం రాజ్యాంగ బిక్ష వల్లనే ఆదివాసి ఎమ్మెల్యేలు ఆదివాసి రిజర్వేషన్ ద్వారా ఎన్నుకోబడ్డారని కానీ ఆ విషయాన్ని విస్మరించి పార్టీలకు తొత్తులుగా, నాన్ ట్రైబల్స్ కు చుట్టాలుగా బ్రతుకుతున్నారే తప్ప ఏనాడు కూడా తమ జాతి మనుగడ కోసం, చట్టాల అమలు కోసం, హక్కుల సాధన కోసం ఈ ఆదివాసీ ప్రజా ప్రతినిధులు కృషి చేసిన దాఖలు లేవని ఆయన ఘాటుగా విమర్శించారు. జీవో నెంబర్ 3 రద్దయితే దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తానన్న ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము లేదు ధైర్యం లేదు, మిగతా సామాజిక ప్రజాప్రతినిధులు కూడా మీలాగే చేతులు ముడుచుకొని కూర్చోలేదని వారు వారి సామాజిక వర్గానికి కావలసినటువంటి హక్కులను ప్రభుత్వంపై కొట్లాడి సాధించుకుంటున్నారని ఆయన తెలియజేశారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 ని తొలగించినట్లే ఏజెన్సీ కోటలోని రాజకీయ ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తే మీకు ఈ పార్టీలు సీట్లు ఇస్తాయి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని హితవు పలికారు. జడ్పిటిసి ఎంపిటిసి వార్డ్ మెంబర్ వంటి కొన్ని స్థానాల్లో రోస్టర్ పాయింట్ పేర్లతోటి అప్పుడప్పుడు కొన్ని జనరల్ కోట కింద నోటిఫికేషన్ పడితే, గద్దాల్లా కాచుకు కూర్చున్న నాన్ ట్రైబల్స్ వెంటనే వారికి ఎదురుగా ఎవరు ట్రైబల్స్ పోటీ చేయకుండా నయానా భయానా చేసి నాన్ ట్రైబల్స్ ఆ పదవులు అనుభవిస్తున్నారని, ఇలాంటి దుస్థితి ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంటు స్థానానికి కలిగితే మీ గతేమైపోతుందో మీ రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి అని ఆయన తెలిపారు. రాజ్యాంగ చట్టాలు రిజర్వేషన్లు ఉన్నంతవరకే ఆదివాసీలను పార్టీలు గాని, పాలకులు గాని, అధికారులు గానీ, నాన్ ట్రైబల్స్ గాని గౌరవిస్తున్నట్టు కనీసం కపట ప్రేమలు, నాటకాలు ఆడతారు తప్ప. ఒక్కసారి రాజ్యాంగ చట్టాలు రిజర్వేషన్లు పోతే వాళ్ల యొక్క నిజస్వరూపాలు బయటపడతాయని దానికి చక్కని ఉదాహరణ జీవో నెంబర్ 3 ని సుప్రీంకోర్టు తొలగించినప్పుడు ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ చేసుకున్న సంబరాలు గుర్తు తెచ్చుకోండి అని ఆయన అన్నారు. ఆదివాసి ప్రజల గురించి ఆదివాసి అభివృద్ధి గురించి ఎలాగో మీరు ఆలోచించలేరు కనీసం రాబోయే ఎన్నికల్లో మీ రాజకీయ స్థానాల కోసమైనా రాజ్యాంగ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి అని చట్టసభలో ప్రస్తా వించండి అని ఆయన కోరారు. అసెంబ్లీలో ఆదివాసి చట్టాల కోసం మాట్లాడని ఆదివాసి ప్రజాప్రతినిధులను ఏజెన్సీ నుండి బహిష్కరించే విధంగా ఆదివాసులు ఉద్యమించాలని, అధికారుల్లో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆదివాసి చట్టాలు అమలు, హక్కుల సాధన కోసం, అభివృద్ధి, సంస్కృతికి పరిరక్షణ కోసం సట్టా సభలో మాట్లాడిన ప్రజాప్రతినిధులకే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ నాయకులు పీఠా ప్రసాద్, సింగోజి సత్తిబాబు, సావిత్రి, భద్ర రావు, వీరమ్మ, అప్పలకొండ, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments