
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 5
అల్లూరి సీతారామరాజు లో రంపచోడవరం నియోజకవర్గంలో శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రంపచోడవరం నందు జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేయడం జరిగింది. అనంతరం ఈ సమావేశ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలు తొలగింపు పై రాజకీయం పులుముకుందని, మరోపక్క నాన్ ట్రైబల్స్ కాసులకు కక్కుర్తి పడిన అదికారులు అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ పూర్తీగా నిలిపివేశారు విమర్శించారు. మన్యం మరియు ఏలూరు ఏజెన్సీ లో అయితే దీని ఊసే లేదని, ఆదివాసీలే పార, గునపం పట్టి అక్రమాల తొలగింపుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారుల నిర్లక్ష్య ధోరణికి చమర గీతం పాడాలి అంటే ఆదివాసులకు మిగిలింది ఇది ఒక్కటే మార్గమని ఇన్ని రోజులు కలెక్టర్లకు, సబ్ కలెక్టర్లకు, పిఓ లకు , ఆర్డీవోలకు తో పాటూ కింది స్థాయి రెవెన్యూ శాఖ మరియు పంచాయతీ శాఖ అధికారులకు శాంతియుత మార్గంలో ఫిర్యాదులు చేస్తూ విన్నవించుకున్న అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆదివాసుల ప్రతాపం ఏమిటో చూపించే సమయం అసన్నమైనదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గౌరవ న్యాయస్థానాలపై తమకి పూర్తి నమ్మకం ఉందని, కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించినట్లు పాటించాల్సిన అధికారులు న్యాయస్థానాల ఉత్తర్వులు సైతం బేకతర్ చేస్తూ తమ సొంత పెద్దనాలు చలయిస్తున్నరు అని మండిపడ్డారు. ఇటువంటి అధికారులు వల్లనే ఏజెన్సీలోని చట్టాలు అమలు కాక ఆదివాసీల హక్కులు హరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. న్యాయస్థానం ఉత్తర్వులు పక్కనపెట్టి వ్యవహరిస్తున్న ఏజెన్సీలోని రెవిన్యూ శాఖ పంచాయతీ శాఖ అధికారులపై గౌరవ న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు గౌరవ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే పలుచోట్ల రాజకీయ ఒత్తులతోటి నాన్ ట్రైబల్ పలుకుబలుడు వలన అధికారుల అడ్మినిస్ట్రేషన్ పవర్ తోక ముడిచిందని దీనివల్లనే ఒక్కొక్క చోట ఒకలాగా కూల్చివేతలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ముడుపులు తీసుకునేటప్పుడు మాత్రం శాఖలు గుర్తుకు రావని ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు మాత్రం రెవిన్యూ వాళ్ళు అది మా శాఖ కాదు పంచాయతి శాఖకు సంబంధించిందని, పంచాయతీ శాఖ వాళ్ళు అది మా శాఖ కాదు రెవెన్యూ శాఖ వాళ్ళదని వంతులేస్తూ అక్రమ కట్టడాలు కోల్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని, వీటన్నిటికీ జిల్లా సుప్రీమ్ అయిన జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తే పట్టించుకోవట్లేదని, కలెక్టర్లు కూడా ఒక మాటపై ఉండట్లేదని ఒక రోజు ఒక విధమైనటువంటి స్టేట్మెంట్లు మరొక రోజు మరొక విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం వలన ప్రజలలో అధికారులు కూడా కొంత సందిగ్ధత నెలకొందని , కలెక్టర్లు స్థాయి వాళ్ళు ఇటువంటి అసంబద్ధ ప్రకటనలు మానుకోవాలని కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రెవిన్యూ శాఖ ఉన్నత అధికారులు వీటిపై తక్షణమే స్పందించి అక్రమ కట్టడాలపై చర్యలకు ఆదేశాలు చేయాలని లేదంటే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీలు దండుగ కదిలి స్వయంగా అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియ మొదలు పెడతారని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులదే పూర్తి బాధ్యత అని తెలియజేశారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిస్థితి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడీద నూకరాజు , పీట ప్రసాద్, జోడి ప్రదీప్ దొర, అబ్బాయి దొర, ఏడుకొండల దొర, చంద్రరావు, కడబాల శ్రీనుబాబు, చిలకల గుణేశ్వరరావు, వెన్నెల చిన్నారావు, మామిడి ఈశ్వర రెడ్డి, శివలింగ బాబు, ఆదివాసి మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
