
రోజుకి పది సార్లు తిరుగుతున్న పోలీసు శాఖ వారి హెలికాప్టర్లు.
బిక్కుబిక్కుమని అరచేతిలో ప్రాణం పట్టుకొని చూస్తున్న ఆదివాసి ప్రజలు.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 25:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల నుండి నూగురు వెంకటాపురం మండల చత్తీస్గడ్ తెలంగాణ సరిహద్దులలో గత మూడు రోజులుగా భారీగా పోలీసు భద్రత బలగాలు మరియు నక్సల్స్ మధ్యలో ఎదురు కాల్పు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిన్న అనగా గురువారం జరిగిన ఎదుర్కాల్పులలో మావోయిస్టులు కొంతమంది చనిపోయారని తెలియజేశారు. అంతేకాకుండా ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసి గ్రామ ప్రజలు కనీస వంట చెరుకు కోసం అడవికి పోవాలంటే భయపడుతూ అరచేతులలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమని జీవనం కొనసాగిస్తున్నారు. కెర్రగుట్ట ఉన్న ప్రాంతమంతా ల్యాండ్ మైండ్లు అమర్చామని ఇదివరకే మావోయిస్టులు ప్రకటించిన విషయము అందరికీ తెలిసినదే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రోజు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ ను బట్టి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసి ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారంటే అతిసయయోక్తి కాదు. రోజు రోజుకి అసలు ఏం జరుగుతుందని ప్రజలు ఆందోళనలగా గడుపుతూ జీవనం కొనసాగి స్తున్నారు. అంతేకాకుండా నడిపల్లి, గలగం, అడవుల్లో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని సమాచారం. భారీగా మావోయిస్టుల మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని వందకు పైగా ఐఈడీ బాంబులు నిర్వీర్యం భద్రత బలగాలు చేశారని విశ్వనీయ సమాచారం.