
ఆదివాసులకు ద్రోహం చేస్తే సహించేది లేదు
13న జరిగే ఐ టి డి ఏ ల ముట్టడి కార్యక్రమాలకు ఆదివాసులు ఐక్యంగా తరలి రావాలి
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11
శనివారం నాడు ఆదివాసి నిరుద్యోగులతోటి విఆర్ పురం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఈనెల 13 సోమవారం నాడు చింతూరు, రంపచోడవరం, పాడేరు ఐటీడీలలో ఆదివాసులు తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని యావత్ ఆదివాసి ప్రజానీకం అంత ఐక్యమత్యంతో కలిసి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేయటంతో ప్రస్తుతం 2025 డీఎస్సీలో ఏజెన్సీలో ఆదివాసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని చేసి ఉంటే నేడు ఆదివాసులకు ఈ గతి పట్టి ఉండేది కాదని, కావున ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామకాలు ఆదివాసులకే దక్కే విధంగా తక్షణమే ఉద్యోగ నియమక చట్టం చేయాలని 2025 మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన నాన్ ట్రైబల్ ఉపాధ్యాయులను ఏజెన్సీ పాఠశాలలో నియమించవద్దని నియమిస్తే ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు. జీవో నెంబర్ 3 రద్దు సాకుతో నాన్ ట్రైబల్స్ ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాల్లో నియమించడం అంటే, నాన్ ట్రైబల్ వలసలను ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో 1/70 చట్టం అమలకు నోచుకోక ఆదివాసి భూములు ప్రభుత్వ భూములు నాట్రైబర్స్ కబ్జాలోకి వెళ్ళిపోతున్నాయని. ఇప్పుడు ఉద్యోగాల పేరుతోటి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీలో తిష్ట వేసి ఆదివాసి హక్కులను హరించి వేస్తారని ఇది ఆదివాసి మనుగడకే ప్రమాదకరమని కాబట్టి ఆదివాసీలందరూ పార్టీలకతీతంగా ఆదివాసి మనుగడ కోసం ఆదివాసి అస్తిత్వం కోసం ఈ నెల 13వ తారీకు ఐటిడీలలో జరిగే నిరుద్యోగులు ముట్టడికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కుటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న షెడ్యూల్ ప్రాంత నియామక చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఆదివాసులతోనే స్థానిక ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంక్షేమ(AVSP) పరిషత్ చింతూరు డివిజన్ అధ్యక్షులు కూర చిట్టిబాబు, ఆదివాసి నిరుద్యోగులు ముత్యాల రెడ్డి, బీర పోయిన గౌతం కుమార్, సోదం విశ్వంత్ కుమార్, పాయం కన్నారావు, మడివి తరుణ్, గొర్రె నితిన్ కుమార్, సోడే దుర్గాప్రసాద్, కురసం ఆదిత్య, సోడే రాజేష్ తదితరులు పాల్గొన్నారు