Tuesday, May 13, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి

ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి

Listen to this article

ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ మరియు


ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సునీతతో మంత్రి భేటీ

పయనించే సూర్యుడు మే 13 నుంచి వచ్చారు పొనకంటి ఉపేందర్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా •అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక


అటవీ సంపదను కాపాడుకోవాలని ఆదేశం


ఉమ్మడి జిల్లాలో 3 పార్కుల అభివృద్ధికి చర్యలు


అటవీ శాఖ పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ


ఎల్ డబ్ల్యూ ఈ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత


•తక్షణమే రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి


పోడు భూములలో వెదురు సాగుకు ప్రాధాన్యం


గిరిజనులకు ఆదాయ వనరులు పెంపు దిశగా అడుగులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు విశేష కృషి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి రూపురేఖలను మారుచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ సంరక్షణ అభివృద్ధి గిరిజన హరిజన వర్గాల ఆదాయ వనరుల పెంపు దిశగా మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే తీవ్రవాద ప్రభావితం ప్రాంతాల నిధుల(ఎల్ డబ్ల్యు నిధులు) నుంచి కోట్లాది రూపాయలతో రహదారుల అభివృద్ధి విస్తరణకు కృషి చేశారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా ఇప్పటికే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పలుమార్లు భేటీ రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఎల్ డబ్ల్యూ ఈ పేజ్ 1,2,3,లలో కోట్లాది రూపాయల నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టారు. మిగిలిన పనులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే లేఖ రాశారు. ఇదే అంశంపై మంగళవారం ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ గారు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సునీత తో భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీశాఖ పెండింగ్ సమస్యలపై సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ గారు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సునీత తో భేటీ అయ్యారు. ఫారెస్ట్ కు సంబంధించి ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చూడాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన సంపదను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టి అడవుల సంరక్షణకు నడుం బిగించాలన్నారు. అడవుల సంరక్షణతోనే మానవజాతి మనవడ సాధ్యమవుతుందని వెల్లడించారు. గత 30 40 ఏళ్ల క్రితం అడవుల సంరక్షణ అభివృద్ధికి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశేష కృషి చేసిందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాధాన్యత లేకుండా పోయిందని నూతనంగా వచ్చిన ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ గారు మరియు MD ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD గా పూర్వవైభవం తీసుకు వచ్చేలా కృషి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్ రహదారులకు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అలాగే పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.LWE నూతన రహదారులు…మంత్రి తుమ్మల ప్రత్యేకత తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు కింద పలు రహదారుల అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఆరు రహదారులకు తక్షణమే అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD ను కోరారు. వాటిలో కొత్తగూడెం జిల్లా పరిధిలో జూలూరుపాడు మండలంలో పడమటి నర్సాపురం నుంచి అన్నారుపాడు, చుంచుపల్లి మండలంలో పాత అంజనాపురం నుంచి బేతంపూడి వరకు, జూలూరుపాడు సుజాతనగర్ మండలాల్లో కొమ్ముగూడెం నుంచి రాఘవపురం వరకు, లక్ష్మీదేవి పల్లి మండలంలో హేమచంద్రపురం నుంచి జూబ్లీ పురం గుట్ట, టేకులపల్లి మండలంలో వెంకటా తండా నుంచి కుంట్ల రోడ్డు వరకు, దుమ్ముగూడెం మండలంలో కొత్తపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. పార్కుల అభివృద్ధికి కీలక ఆదేశాలు…ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్ధి ఆధునికాంగులతో నూతన పార్కుల నిర్మాణానికి మంత్రి తుమ్మల విశేష కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మంలోని వెలుగుమట్ల పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలం lo కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకో పార్కు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. పర్యాటకులను ఆకర్షించేలా ఆధునిక హంగులతో అత్యాధునిక సౌకర్యాలతో పార్కుల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. పార్కులను అభివృద్ధి చేస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారని పార్కుల అభివృద్ధితో ఈ ప్రాంత రూపురేఖలు మరింతగా మారుతాయన్నారు. అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఆదాయ వనరులకు సైతం పెంపొందించాలి…ఏజెన్సీ ప్రాంతంలో హరిజన గిరిజనులకు ఆదాయ మార్గాల పెంపు దిశగా ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ గారు మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో అడవుల సంరక్షణకు నడుం బిగించి, గిరిజనుల ఆదాయం పెంపొందించే మార్గాలను అన్వేషించాలన్నారు. పర్యాటక అభివృద్ధితో గిరిజనుల అభివృద్ధి చెందే అవకాశము ఉందన్నారు. పోడు భూములలో వెదురు సాగు కు శ్రీకారం చుట్టాలన్నారు. తద్వారా గిరిజనులకు ఆదాయ వనరులు పెంపొందుతాయన్నారు. వన సంరక్షణతో ప్రకృతి ఫరీడవిల్లుతుందన్నారు. గిరిజన జీవితాల్లో వెలుగులు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments