ఏజెన్సీ లో ఉన్న పాడేరు మెడికల్ కాలేజీలో 400 వందల పోస్టులను నాన్ ట్రైబల్స్ తో భర్తీకి సిద్ధం
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 25
ASR జిల్లా,పాడేరు గవర్నర్ మెడికల్ కాలేజీ ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో స్థానిక అభ్యర్ధులకు అన్యాయం జరిగిందని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టి జోగారావు ఆవేదన వ్యక్తం చేశారు 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్న జి ఓ లను అమలు చేయకుండా కొత్త కొత్త జి ఓ లను తెచ్చి వాటి ఆధారంగా పోస్టులు భర్తీ చేసి ఏజెన్సీ వాసులను మోసం చేస్తున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఏజెన్సీలో జి ఓ నంబర్:68 అమలులో ఉండగా మళ్ళీ కొత్త జి ఓ :92 తేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రభుత్వాలను ప్రశ్నించారు పాడేరు మెడికల్ కాలేజీలో దాదాపుగా 400 వందల ఉద్యోగాలను నాన్ ట్రైబల్ తో భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఏజెన్సీ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ఉద్యోగాలను నాన్ ట్రైబల్ తో భర్తీ చేసి ఏజెన్సీ నిరుద్యోగులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు, ఈ విషయాన్ని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు మా ఏజెన్సీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే అప్లై చేసిన అభ్యర్ధులను తీసుకొని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలే మోసం చేస్తుంటే ఆదివాసీలకు న్యాయం చేసేది ఎవరని అన్నారు, తక్షణం ఆ నోటిఫికేషన్ రద్దు చెయ్యాలి లేదంటే అప్లై చేసిన ఆదివాసులతో మాత్రమే భర్తీ చెయ్యాలని పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేసారు

