
మెడికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీ పోస్టులను భర్తీ వెంటనే భర్తీ చెయ్యాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 28
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో ఈ రోజు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కూనవరం మండలం, కోతుల గుట్ట వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ఏరియాలో మెడికల్ డిపార్ట్మెంట్ నందు హెల్త్ అసిస్టెంట్స్ లను రీ డిప్లొయిమెంట్ పేరుతో బదిలీ ప్రక్రియ చేపడుతున్నారు ఈ బదిలీ పేరుతో మైదాన ప్రాంత ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతానికి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు అలా కాకుండా ఏజెన్సీ ప్రాంత పోస్టులలో ఏజెన్సీ ఉద్యోగులను రీ డిప్లొయిమెంట్ చెయ్యాలని అన్నారు ముందుగా ఏజెన్సీ ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నామని అన్నారు అలా కాని పక్షాన ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కరక అర్జున్, చింతూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి తాటి రామకృష్ణ, కారం రత్తయ్య, సొందే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు