పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలానికి నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ప్రతిభతో ఎంపికై, గతంలో వరంగల్ కమిషనరేట్‌లో ఎస్‌హెచ్‌ఓగా సేవలందించిన ఆమె, ప్రభుత్వ శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏన్కూర్ మండలానికి నియమితులయ్యారు.సోమవారం అధికారికంగా పదవిలో చేరిన భాగ్యశ్రీకి మాజీ ఎం.పి.డి.ఓ రంజిత్ కుమార్, ఎంపీ ఓ జీవీఎస్ నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.అదే సందర్భంలో ఏన్కూరు పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన ఎం.పి.డి.ఓ భాగ్యశ్రీకి ఘన ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు రవికుమార్, జనరల్ సెక్రటరీ కోటేశ్వరరావు, అలాగే పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.తరువాత అధికారులతో సమావేశం నిర్వహించిన భాగ్యశ్రీ, గ్రామీణ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, సేవాభావంతో మండల ప్రగతికి కృషి చేస్తానని తెలిపారు.


