
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం జడ్పిటిసి గా గుడ్ల వెంకటేశ్వరరావు
పోటీ చేయించాలని సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది. పొత్తులు లేకుంటే సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకుడుగా, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి మండలంలో అన్ని గ్రామాలకు సుపరిచితుడు, మండల కార్యదర్శిగా, సీఐటీయూ మండల కార్యదర్శిగా, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులుగా, ఆరికాయలపాడు ఉప సర్పంచ్ గా, గత 20 సంవత్సరాలుగా ఎల్ఐసి ఏజెంట్ గా చైర్మన్ క్లబ్బు మెంబర్ గా, ఎల్ఐసి ఏఐఓ వరంగల్ డివిజన్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా, ప్రజాశక్తి, నవతెలంగాణ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది. 20 సంవత్సరాలు వయసులో 1996 లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినా అన్నింటిని ఎదుర్కొంటూ ఇప్పటివరకు నమ్ముకున్న పార్టీ కోసం పనిచేస్తున్నాడు. సిపిఎం పార్టీ లో మంచి నాయకుడిగా గుర్తింపు ఉన్నది. 2013 సొసైటీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ తరఫున జన్నారం నుంచి పోటీ చేసి కేవలం 6 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.2019లో శ్రీరామగిరి ఎంపీటీసీ జనరల్ స్థానం నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 150 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పాలక పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టిన పార్టీ కోసం పనిచేస్తున్నాడు. మండలంలో సిపిఎం పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. తనకు మండలంలో అన్ని గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల్లో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. పార్టీ ఓటు బ్యాంకు కాకుండా మండలంలో మంచి సానుభూతిపరుడు. అదేవిధంగా తన గ్రామంలో చనిపోయిన ప్రతి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వ్యక్తి ఆయన, తన గ్రామంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్లి ఆదుకుంటాడు. పేద ప్రజల కోసం ప్రతినిత్యం పాటుపడే వ్యక్తి జివిఆర్ అంటే తెలియని వారు ఉండరు. మండల పరిధిలో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. తన గ్రామంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతూ ఉంటే తన సొంత ఖర్చులతో ఎన్ఎస్పి కాలువలు, రైతులు పొలాలకు వెళ్లే రోడ్లు ప్రతి సంవత్సరం రిపేర్ చేయిస్తారు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో రిపేర్ చేయించారు. ప్రతి సంవత్సరం సంక్రాత్రి పండుగ రోజు గ్రామంలో సొంత ఖర్చులతో ముగ్గుల పోటీ నిర్వహిస్తారు. అదేవిధంగా గ్రామంలో ఉచితంగా మెడికల్ నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు.ఇలాంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం వలన మండల ప్రజలకు ఉపయోగం జరిగే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.