పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విద్యార్థుల విద్యా అభివృద్ధికి వినియోగం కావాలని, ఏన్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మార్వో ( స్క్రూటినీ అధికారి)సి.హెచ్. శేషగిరిరావు పరిశీలించారు.ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా మంజూరైన నిధులతో కళాశాలలో జరుగుతున్న ఫ్లోరింగ్, టాయిలెట్ నిర్మాణం తదితర పనులను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పనులు నాణ్యతతో పాటు సమయానికి పూర్తయ్యేలా పంచాయతీరాజ్ ఎ.ఇ. సూర్యనారాయణకు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ప్రతి అభివృద్ధి పని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉండాలి. నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సింహాచలం, సిబ్బంది మరియు సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.


