పయనించే సూర్యుడు/జనవరి 22/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలంలో 13 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో మండల అధికారులు మరియు ప్రత్యేక అధికారులు ఎవరినైతే కేటాయించారో అధికారులు అందరూ తగిన సమయంలో హాజరయ్యి ప్రజల కు ఉన్నటువంటి సమస్యల మీద అధికారులు వారికి సమాచారం ఇవ్వడంతో పాటు వారి యొక్క దరఖాస్తులను స్వీకరించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు
ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ప్రజలకు ఉన్నటువంటి అనుమాలను అధికారులు పూర్తిస్థాయిలో వారికి సమాచారం ఇవ్వడంతో పాటు నిజమైన లబ్ధిదారుల ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ప్రతి దరఖాస్తును తీసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వం నుండి వచ్చిన పథకాల లో ఉన్నటువంటి లబ్ధిదారుల పేర్లను పూర్తిస్థాయిలో గ్రామసభలో చదివి వినిపించడం జరిగింది కొన్ని గ్రామపంచాయతీలలో అధికారులతో కొంతమంది లబ్ధిదారులు అర్హత ఉన్న మా పేర్లు రాలేదు ఎందుకు రాలేదని అడగడం జరిగింది లబ్ధిదారులు అడిగిన ప్రశ్నలను మండల అధికారులు సమాధానం ఇచ్చి వారి వద్ద నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఏన్కూరు మండలంలో జరిగిన అంటే గ్రామసభలు ప్రజల సమక్షంలో జవాబుదారితనం పారదర్శకంగా గ్రామసభలు జరిగాయి ఈ గ్రామ సభలో ఏన్కూరు మండలం ఎంపీడీవో మరియు ఎమ్మార్వో ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభల్లో ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో రమేష్ ఎమ్మార్వో శేషగిరిరావు ఎంపీఓ జి ఎస్ వి నారాయణ పి వెన్నెల ఏ రంజిత్ బి అనూష వి నవీన్ ఏ నరసింహారావు హాజరు కావడం జరిగింది
మరియు గ్రామ సభలు విజయవంతం కావడానికి పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ సిబ్బంది అంగనవాడి టీచర్స్ ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్స్ నర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది