PS Telugu News
Epaper

ఏపీ ప్రభుత్వ పెద్ద నిర్ణయం – లబ్ధిదారులకు రూ.15 వేల చొప్పున అందజేయనున్న నిధులు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మెుంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మెుంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.తుఫాన్ బీభత్సంతో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోస్త్రాంధ్ర ప్రాంతాలలో అటు రైతాంగంతోపాటు ఇటు చేనేత కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకవైపు ఈదురుగాలులు, భారీ వర్షం కురియడంతో చేనేత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకారం, తుఫాన్ వల్ల నష్టపోయిన చేనేత కుటుంబాలను ఆదుకుంటామని, వారికి పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

చేనేత కార్మికుల నడ్డివిరిచిన మెుంథా తుఫాన్ : మెుంథా తుఫాన్ చేనేత కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా చేనేత కార్మికులు చీరలు నేసేందుకు వినియోగించే రసాయనాలు పాడైపోయాయి. అంతేకాదు మగ్గాలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అధికారయంత్రాంగం నష్టపోయిన వారి వివరాలను సేకరించింది. బాపట్ల జిల్లాలో 8,567, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,278, కృష్ణా జిల్లాలో 3,900, శ్రీకాకుళం జిల్లాలో 3,333, నెల్లూరు జిల్లాలో 2,400, తిరుపతి జిల్లాలో 1,700 కుటుంబాలు నష్టపోయినట్లు అధికారయంత్రాంగం గుర్తించింది. మిగిలిన జిల్లాల్లో కూడా బాధితులను గుర్తించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

27,982 చేనేత కుటుంబాలకు తీరని నష్టం: ఈ మెుంథా తుఫాన్ వల్ల ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం తక్షణ సాయం సైతం అందజేసింది. ఉచిత నిత్యావసర సరుకులు సైతం అందజేసింది. చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, 1 లీటరు పామాయిల్, 1 కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార వంటి వస్తువులు అందించింది. అయితే చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. తుఫాన్ కారణంగా నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత నిర్వహించిన సర్వేలో 27,982 చేనేత కుటుంబాలు నష్టపోయినట్లు గుర్తించారు. 3 మగ్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, మరో 3 మగ్గాలకు చిన్నపాటి నష్టం జరిగింది. దెబ్బతిన్న మగ్గాల పరికరాలు కొనుగోలు చేసేందుకు బాధితులకు రూ.10 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మెుత్తం చేనేత కార్మికులకు రూ.15వేల ఆర్థిక సాయం అందించి వారికి భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని…వారికి ఆర్థికంగా భరోసా కల్పించినట్లు అవుతుంది అని చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత అన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top