
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 2 ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన
క్రమపద్దతిలో ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి
చలివేంద్రాల సమర్థ నిర్వహణకు చర్యలు
ప్లాస్టిక్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఖమ్మం
ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మండలాల్లో తహసిల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలు ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఏప్రిల్ తర్వాత మండల స్థాయి కార్యాలయాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వాడ వద్దని కలెక్టర్ తెలిపారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని అన్నారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో బస్ స్టాప్, ఆటో స్టాండ్ ల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో అధికారులు ఓపికతో ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇంచార్జ్ ఇడి నవీన్ బాబు, బిసి సంక్షేమ అధికారి జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మీ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.