
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామపంచాయతీలో నేడు ఇందిర ఇండ్లు శంకుస్థాపనలు, సన్న బియ్యం భోజన కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభిస్తారని స్థానిక టేకులపల్లి తహసిల్దార్ నాగ భవాని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ పాల్గొనాలని తహసిల్దార్ తెలియజేశారు.