
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు గురువారం రోజున ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో దాదాపు 175 నూతన రేషన్ కార్డులు మరియు మందికి పైగా రేషన్ కార్డులో చేర్పులు కావడం జరిగింది. నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి అన్న ఉద్దేశ్యంతో నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియను చేపడుతుంది. ఇంకా గ్రామంలో అక్కడక్కడ మిగిలిపోయిన వారికి, దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దాదాపు పది సంవత్సరాల తర్వాత తమకు రేషన్ కార్డులను మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమదేవరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
