
పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు
ఈరోజు సోమవారం రోజున ఏర్గట్ల మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటంతో వచ్చిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చెయ్యటం జరిగింది. ప్రతి వచ్చిన ఒక్కరు వెళ్లి తీసుకవెళ్లవాల్సిందిగా తెలిపారు. ఇంకా మిగిలిన అర్హులైన రాని వారు యుంటే మీ సేవలో అప్లై చేసుకోవాలని, కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఉచిత కరెంట్ 200 యూనిట్ల కోసం, సబ్సిడీ సిలిండర్ కోసం ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకోవాలని, ఈ కొత్త రేషన్ కార్డ్ తో వైద్యం కోసం 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు చదువు కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే కాకుండా కుటుంబ ఐడెంటీ కార్డ్ గా పనికి వస్తాది. పార్టీలకు అతీతంగా ఖర్చు కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్టి కార్యక్రమములో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు
