
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఏర్గట్ల మండల కేంద్రంలో జై బాపు.. జై భీం.. జై సంవిధాన్ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మరియు కార్యక్రమ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తుందని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం పిలుపుతో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
