
పయనం చేసి సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 26:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జౌళి శాఖ అధికారి కృష్ణయ్య ను తన కార్యాలయంలోఅడ్డంగా దొరికి పోయాడు. అన్నమయ్య జిల్లా, రాయచోటిలో చేనేత జౌళి శాఖ అధికారి కృష్ణయ్య సోమవారం లబ్దిదారుల నుంచి తన కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటూండగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ విజయకుమారి ఆదేశాలతో కడప ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి, సీఐలు జిల్లా జౌళి శాఖ అధికారి కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అడిషనల్ ఎస్పీ విజయకుమారి తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపారు.